Home / NATIONAL / రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!

రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉహించని విషాదం ఎదురైంది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం చనిపోయారు.గోవా నుంచి బాగల్‌ కోట్‌ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు.

Siddu Nyama Gowda

జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర సంతాపం తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat