సినిమా వాళ్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం..డేటింగ్ చేయడం మనం తరచుగా వింటూనే ఉన్నాం .ఇటివల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా వీరి లిస్టులోకి మరో క్రికెటర్ చేరిపోయారా ..
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటుస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న భామతో టీం ఇండియా యంగ్ ప్లేయర్ ..ఇటివల ముగిసిన ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన కేఎల్ రాహుల్ ప్రేమలో పడ్డారా ..గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అంటే అవును అని అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు .ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న కొన్ని ఫోటోల ఆధారంగా ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది .
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెంది ..టాలీవుడ్ యంగ్ హరో అక్కినేని నాగచైతన్య సరసన లేటెస్ట్ మూవీలో నటిస్తూ ఎంట్రీ ఇస్తున్న నిధి అగర్వాల్ ,రాహుల్ ప్రేమలో మునిగితేలుతున్నారు .అందులోభాగంగా ముంబై లో బాంద్రా ప్రాంతంలో జంటగా కన్పించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ ఫోటోల ఆధారంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ..పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అని నెటిజన్లు కోడై కూస్తున్నారు .