రాణా, హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని రకాల రోల్స్ చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుననాడు. మరీ ముఖ్యంగా బాహుబలి, ఘాజీ లాంటి మంచి కథలతో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి పక్కా కమర్షల్ సినిమాలు చేస్తూతన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్రస్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా, రాణా ప్రస్తుతం అన్ని షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. రాణాకు కుడికన్ను సరిగ్గా కనపడదన్న విషయం మనందరికి తెలిసిందే. యూఎస్‌లో జరగబోయే ఈ కంటి ఆపరేషన్ కోసం రాణా తన షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే, తనకు కుడికన్ను సరిగ్గా కనపడదన్న విషయాన్ని మంచు లక్ష్మీ హోస్ట్‌గా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించే ప్రోగ్రామ్‌లో బయటపెట్టాడు. అప్పటి వరకు రాణాకు ఇలాంటి కార్యక్రమం ఉందని, తన ఇంట్లో వాళ్లకు, సన్నిహితులకు తప్ప మరెవ్వరికీ కూడా ఈ విషయం తెలియదు. దగ్గుబాటి రాణాకు కంటి ఆపరేషన్ సాఫీగా సాగిపోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.