అందాల రకుల్ ప్రీత్ సింగ్ మోడరన్ గార్ల్ కావడంతో ఆమెకు మోడరన్ రొమాన్స్ అంటే ఇష్టమేమో అనుకుంటారు అందరు. కానీ, ఈ భామకు ఎలాంటి రొమాన్స్ అంటే ఇష్టమో తెలుసా..? ఓల్డెన్ డేస్ రొమాన్స్ అంటే పిచ్చ పిచ్చగా నచ్చుతుందని అంటోంది. పాత రోజులు అంటే ఎప్పుడో 1960, 70 కాదు. ఇంట్లో ఫోన్ మోగితే.. ఎక్కడ బాయ్ ఫ్రెండ్ చేశాడోనని, ఆ విషయం ఎక్కడ తల్లిదండ్రులకు తెలిసిపోతుందోనన్న భయం తొణికిసలాడటం అంటే తనకు ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మామా – అల్లుడు సినిమాకు టైటిల్ ఫిక్స్..!
అయితే, ఈ విషయాలన్నీ మోడ్రన్ భామకు ఎలా తెలుసనుకుంటున్నారా..? ఈ విషయాలన్నిటిని తన తండ్రి .. తనను దగ్గర కూర్చోబెట్టి మరీ చెప్పాడట. ఇక అప్పట్నుంచి పాత రోజులనాటి రొమాన్స్ కావాలంటూ.. తహ తహలాడుతోంది రకుల్.