కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కాగా, నితిన్‌తో కలిసి లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన గ్లామర్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికి తెలిసిందే. మేఘా ఆకాష్ నటించింది రెండే చిత్రాలే అయినా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, మేఘా ఆకాష్‌ను మొదటగా చూసిన వారంతా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని భావించారు. కానీ, కాలం కలిసిరాక, మేఘా ఆకాష్ నటించిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
see also:పీకల్లోతు ప్రేమలో పరుల్ యాదవ్..!
ఇలా వరుసగా రెండు చిత్రాలు ప్లాప్ కావడంతో.. ఇక సినిమాలకు మేఘా ఆకాష్ దూరమవుతుందనుకున్నారు సినీ జనాలు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా మేఘా ఆకాష్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో అవకాశం వచ్చింది. అయితే, కాలా చిత్ర ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్న రజనీ తన తరువాతి చిత్రం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పాత్రకు మేఘా ఆకాష్‌ను ఎంపిక చేశారు.
see also:పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్