Home / ANDHRAPRADESH / ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది అని ఒక ఆర్టికల్ ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు తన వెబ్ పోర్టల్ లో రాశారు.ఉన్నది ఉన్నట్లు మీకోసం . టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన తెలుగు పోర్టల్ తెలుగు.సమయం .పోర్టల్ చేసిన ఒక సర్వే ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పాలనపై ఏభై ఏడు శాతం మంది విరక్తి చెందారు.

see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..!

వచ్చే ఎన్నికలలో వైసీపీకు 42 శాతం మంది ఓటు వేస్తామని చెబితే ,తెలుగుదేశం పార్టీకి 30.85 శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు. సమయం పోర్టల్ లో వచ్చిన కథనం ఈ విధంగా ఉంది.నారా వారి నాలుగేళ్ల పాలన కాలం గురించి ఆంధ్రా ప్రజానీకం ఏమనుకుంటోంది..? ‘సమయం’ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఇవి అని ఆ వెబ్ లో వివరించారు.దాదాపు 12.83 లక్షల మంది వారం రోజుల పాటు జరిగిన ఈ పోల్ లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. 57 శాతానికిపైగా ప్రజలు పెదవి విరిచారు. 42.70 శాతం మంది బాబు పాలన పట్ల సానుకూలంగా స్పందించారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే దాదాపు 16 శాతం మంది మాత్రమే బాబు పాలన భేషుగ్గా ఉందన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఉపయోగపడిందా? అనే ప్రశ్నకు 58.30 శాతానికి పైగా ప్రజలు లేదని బదులిచ్చారు. 33.18 శాతం మంది మాత్రం బాబు అనుభవం అక్కరకొచ్చిందన్నారు.

see also:వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

మిగతా వాళ్లు చెప్పలేమని సమాధానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరెవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు దాదాపు 42 శాతం మంది ప్రతిపక్ష నేత జగన్‌కు ఓటేశారు. 30.85 శాతం మంది బాబుకు ఓటేస్తామన్నారు. 19.36 శాతం మంది పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. 7.80 శాతం మంది ఇతరులకు ఓటేస్తామన్నారు.ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరిగిందా? అని అడగ్గా 67.89 శాతం మంది అవునని బదులివ్వడం గమనార్హం. కేవలం 17 శాతం మంది మాత్రమే లేదని చెప్పగా.. మిగతా 15 శాతం మంది చెప్పలేమన్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సమర్థనీయం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతానికిపైగా బదులిచ్చారు. కేవలం 10.59 శాతం మంది మాత్రమే బాబు తీరును సమర్థించగా, మిగతా వాళ్లు చెప్పలేమన్నారు.

see also:వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలమయ్యారని 76.30 శాతం మంది అభిప్రాయపడ్డారు. 23.84 శాతం మంది మాత్రమే ఈ విషయంలో బాబు వ్యవహరించిన తీరును సమర్థించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిందా? అనే ప్రశ్నకు దాదాపు 64.50 శాతం మంది అవునని బదులిచ్చారు. దాదాపు 20 శాతం మంది మాత్రం అవినీతి పెరగలేదన్నారు. మిగతా వాళ్లు చెప్పలేమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోదగ్గ పథకాలేవీ లేవని 63.70 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24.53 శాతం మంది చంద్రన్న బీమా పథకం బాగుందన్నారు.

see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat