Home / NATIONAL / న్యూజీలాండ్ లో  వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!

న్యూజీలాండ్ లో  వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!

 న్యూజీలాండ్ లో ఆ దేశ  టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రీష్మ కాసుగంటి రాష్ట్ర గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి తెరాస న్యూ జీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు ఇనగంటి గారు అధ్యక్షత వహించారు . హానరరీ చైర్ పర్సన్ శ్రీ కళ్యాణ్ రావు కాసుగంటి గారు మాట్లాడుతూ కెసిఆర్ గారి ఆలోచన విధానానికి , కార్య దీక్షతకు నిదర్శనాలు .
4 సంవత్సరాల కాలంలో దేశంలోనే ,మన రాష్ట్రము అగ్రగామిగా నిలవడానికి ముఖ్య కారణం అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జగన్ రెడ్డి వాడ్నలా మాట్లాడుతూ రాష్ట్రము ఏర్పాటు అమర వీరుల త్యాగాల ఫలితం అన్నారు . మరొక ఉపాధ్యక్షుడు రామ రావు రాచకొండ అందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . తెరాస న్యూ జీలాండ్ అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి కొసన మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణను అన్ని వర్గాల సంక్షేమమే ఊపిరిగా పాలిస్తున్న సమకాలీన రాజకీయాల్లో చెప్పింది చేసే నాయకుడు , ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన సమర్ధుడైన మహా నాయకుడు , సంక్షేమ సారధి కెసిఆర్ గారు మాత్రమే.
దేశ రాజకీయల్లో కాంగ్రెస్ పోతే బీజేపీ , బీజేపీ పోతే కాంగ్రెస్ 70 సంవత్సరాల్లో రైతుల కోసం సాధించింది శూన్యం . కెసిఆర్ గారు తన నిజాయితీ ని , చిత్తశుద్ధి ని రైతుల కోసం రైతు బంధు , ఇన్సూరెన్స్ అన్ని రాష్ట్రాల్లోని రైతులను , రాజకీయ నాయకులను ఆలోచింపచేస్తోంది . మన కెసిఆర్ గారు దేశ రాజకీయాల్లోకి ఫెడరల్ ఫ్రంట్ తో , ఫెడరల్ ఎజెండా అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి , అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పడేది గా ఉంటుందనడంలో సందేహం లేదు . మన కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనని , ఇతర రాష్ట్రాల మిత్రులతో పని చేసే దగ్గర , మీరు అటెండ్ అయ్యే ఈవెంట్స్ లో ఒక చర్చను లేవేదీయండి మీ అభిప్రాయాన్ని పంచుకొని ,కెసిఆర్ గారు మన తెలంగాణలో సాధించిన ప్రగతిని ఉదాహరణగా చూపుతూ చైతన్య పరచాలని పిలుపునిచ్చారు . తెలంగాణ చేతి వృత్తి కళాకారులను(చేనేత , హైదరాబాద్ గాజులు , ఫిలిగ్రి , నిర్మల్ బొమ్మలు …) ఆదుకొనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన బ్రాండ్ తెలంగాణ ముఖ్య వ్యవస్థాపకురాలు తెరాస న్యూ జీలాండ్ ఉమెన్స్ అఫైర్స్ ఛైర్పర్సన్ శ్రీమతి సునీత విజయ్ మాట్లాడుతూ బ్రాండ్ తెలంగాణ ద్వారా మనం కొన్ని కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నాం.
దీని ఇలాగె కొనసాగిస్తే మనవంతు బాధ్యతగా మనం బంగారు తెలంగాణ కోసం పాటు పడుతున్నట్టే . తెలంగాణ ఉత్పత్తులను సేవభావంతో ప్రమోట్ చేస్తున్న , మరియు కొనుగోలుదారులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆలాగే బ్రాండ్ తెలంగాణ ప్రచారకర్తలుగా
(బ్రాండ్ అంబాసడార్) సునితావిజయ్ ,శ్రీదేవి కృష్ణ పూసర్ల , వర్ష రెడ్డి పట్లోళ్ల ,శీతల్ అలాం,లక్ష్మి కాసుగంటి , విజేత రావు యాచమనేని , గ్రీష్మ కాసుగంటి, సేజల్ ఇనగంటి , కిరణ్ కుమార్ పోకల లను నియమించారు .
అరుణ్ ప్రకాష్ రెడ్డి గారు, కాళేశ్వరం మరియు మిషన్ కాకతీయ ల గురించి స్వీయ అనుభవాలను పంచుకున్నారు . మెంబర్షిప్ ఇంచార్జి కిరణ్ కుమార్ పోకల మాట్లాడుతూ అందరం మన కుటుంబ సభ్యులు , మిత్రులందరిని ఈ సారి అసెంబ్లీ , లోకసభ లకు తెరాస అభ్యర్థులకు వోట్ వెయ్యాలని అభ్యర్థించాలని కోరారు . అనంతరం 4 సంవత్సరాల తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 40 డోవ్ జాతి పక్షులకు స్వేచ్ఛనిచ్చారు . పిల్లలు పెద్దలు అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు .
తెలంగాణా రుచులు , సర్వపిండి , హలీం , చికెన్ కర్రీ , పప్పు , పచ్చిపులుసు ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి కిరణ్కుమార్ పోకల వ్యాఖ్యాతగా ,వ్యవహరించారు . ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి పట్లోళ్ల,అభిలషరావు యాచమనేని, మల్లికార్జున్ రెడ్డి బద్దం , సుశాంతి అరుణ్ ప్రకాష్, పానుగంటి శ్రీనివాస్ వరుణ్ రావు మేచినేని ,రాజేశ్వరి కొండగారి ,నర్సింగ రావు పుప్పాల ,శ్రీహరి రావు బండ, అశుతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat