Home / SLIDER / ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాశ్ విమాన‌శ్ర‌యంలో స్వాగతం ప‌లికారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ త‌దిత‌రులు ఉన్నారు.

కాగా, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలపై ప్రధానితో సీఎం చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసు చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరనున్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీభవన్ అంతా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దానిని తమకే ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి బదులుగా ఈ భూమిని కేటాయించిందని, ఈ ఆస్తి అంతా పూర్వ నిజాం ప్రభుత్వానిదేనని వివరించనున్నారు.