కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!! – Dharuvu
Home / ANDHRAPRADESH / కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను చంపి టీడీపీ జెండా ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు . టీడీపీ జెండా చూసే జనాలు ఓట్లేశారు తప్ప.. చంద్రబాబు ముఖం చూసి కాదన్నారు.దమ్ముంటే ఆ జెండాను నందమూరి కుటుంబానికి ఇచ్చి నీ సొంత జెండాతో పోటీ చేసి గెలువు అంటూ సవాల్ విసిరారు . కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తిచంద్రబాబు అంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ దుస్థితికి కారణం నువ్వు కాదా? .. టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ సీటు అమ్మలేదా? అని ప్రశ్నించారు.నీ అవసరానికి అందరినీ వాడుకుని వదిలేస్తావ్‌. ఓటుకు కోట్లు కేసులోఆ గొంతు నీదే అని ప్రజలతో చెప్పిస్తా.. రాజీనామా చేసే దమ్ముందా చంద్రబాబు ?’ అని మోత్కుపల్లి బాబుకు సవాల్‌ విసిరారు.

see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు