జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు – Dharuvu
Home / ANDHRAPRADESH / జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ రోజు పాదయాత్ర చేస్తానని అన్నారు .ఎప్పుడైతే చంద్రబాబు టీడీపీ పార్టీ నుండి సస్పెండ్‌ చేసిండో అప్పుడే ఆయన  పతనం ప్రారంభమైందన్నారు.నమ్మేవాడి గొంతు కోసే నమ్మకద్రోహం చేసే వ్యక్తి చంద్రబాబు .ఇన్ని రోజులు పోనీలే అని గమ్మున ఉంటే కిరాయికి అమ్ముడుపోయానని నాపై తప్పుడు మెసేజ్‌లతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తావా? పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు పెడితే ఊరుకోను. నువ్వేమైనా దొరవా? సుద్ద పుసవా? నరహంతకుడివి.. దొంగవి… ఎన్టీఆర్‌ స్పిరిట్‌ నాలో ఎంతకాలం ఉంటే అంతకాలం పని చేస్తా’ అని మోత్కుపల్లి సంచలన వాఖ్యలు చేశారు.

see also:కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!