అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ – Dharuvu
Home / SLIDER / అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ

అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగార్థుల మనోభావాలకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అభ్య‌ర్థుల‌కు మేలు చేసేలా ప‌రీక్ష తేదీలో మార్పులు చేసింది. తెలంగాణ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. వచ్చే జూలై నెల 29వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

ఈనెల 15వ తేదీన తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఉన్నందున ఈ తేదీని మార్చాలని పెద్ద ఎత్తున అభ్యర్థులు కోరిన నేపథయలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణ‌యంతో త‌మ‌కు మ‌రింత స‌మ‌యం క‌లిసి వ‌చ్చింద‌ని ప‌లువురు అభ్య‌ర్థులు పేర్కొంటున్నారు.

see also: ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!