తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!! – Dharuvu
Home / SLIDER / తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు కర్ణాటక రాష్ట్ర సహకారశాఖ మంత్రి బండప్ప కాశీంపూర్ ఫిదా అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అయన కితాబునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి బీదర్ వెళ్తూ గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్ నివాసంలో బండప్ప మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం పై ప్రశంసలు కురుపించారు.ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలో అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. తమకు సీఎం కేసీఆర్ నుంచి సంపూర్ణ సహకారం ఉన్నదని, ప్రాంతీయ పార్టీలు బలపడాలని కోరుకుంటూ ముందుగా కుమారస్వామిని కేసీఆర్ కలిసారని మంత్రి బండప్ప గుర్తుచేశారు. రానున్న ఆరునెలల్లో కర్ణాటకలో 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం కుమారస్వామి కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు.

see also:కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు