గ్రామంలోకి ప్రవేశించిన దాదాపు 18 అడుగుల పొడవైన కొండచిలువను ఓ అటవీశాఖ అధికారి పట్టుకున్నాడు. దాన్ని చక్కగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయాలి కదా. కానీ అలా చేయడానికి ముందు దానితో అందరూ కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. ఇక మరి అది ఊరుకుంటుందా.. వెంటనే అటవీశాఖ అధికారి మెడ మొత్తం చుట్టేసుకుని బిగించేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. అతడి ఊపిరి ఆగిపోతుందేమోనని భయపడ్డారు. కానీ వెంటనే గమనించిన మరో వ్యక్తి దాన్ని చుట్టుకోకుండా ఆపగలిగాడు.
కోల్కతాకు 610 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువ మేకను తినేసింది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీశాఖ అధికారి సంజయ్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సంజయ్.. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న కొండచిలువను స్థానికుల సహాయంతో తన మెడలో వేసుకున్నారు. ఇలా వేసుకున్న కాసేపటికి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా అధికారి మెడను ఫైథాన్ చుట్టేసింది. దీంతో స్థానికులు కొండచిలువను లాగేశారు. ఆ తర్వాత పైథాన్ను తీసుకెళ్లి సమీప అడవిలో వదిలేశారు.
#WATCH Narrow escape for Sanjoy Dutta, Range Officer of Baikunthapur Forest in Jalpaiguri after a python he rescued from a village almost strangled him to death while he was posing for selfies with locals. #WestBengal pic.twitter.com/KroJHOCOkk
— ANI (@ANI) June 18, 2018