Home / TELANGANA / రూ.100 కోట్ల తోహాస్ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం..

రూ.100 కోట్ల తోహాస్ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం..

ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ ( తోహాస్) అక్రమాలకు అడ్డుకట్ట పడింది.నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల పరమైన సుమారు రూ.100 కోట్ల తోహాస్ భూములు మంత్రి మహేందర్ రెడ్డి చొరవతో తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోగలిగింది. జాతీయ రహదారుల మీద ట్రక్ డ్రైవర్ లకు విశ్రాంతి నిచ్చేందుకు కేంద్రం సహాకారంతో గత 1987 లో రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర పెద్దంబర్ పేట (కలాన్) వద్ద రవాణాశాఖ కమీషనర్ అధ్యక్షతన ట్రక్ పార్కింగ్ స్థలం కేటాయించి భవనం నిర్మాణం కోసం రూ. 25 లక్షలు సైతం అందించారు.

see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!

అప్పట్లో ఎన్ హేచ్ 9 మీద సర్వేనెంబర్ 244 లో రవాణా శాఖ కమీషనర్ చైర్మెన్ గా, ట్రక్ ఆపరేటర్స్ ప్రతినిధులు, కేంద్ర ప్రతినిధుల తో ఏర్పాటైన కమిటీకి 9.37 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే చైర్మెన్, కమిటీ అనుమతి లేకుండా కార్యదర్శి తన కుమారుని పేర అక్రమంగా భోగస్ కంపెనీ సృష్టించి సదరు కంపెనీ పేరు మీద 33 ఏళ్ళకు లీజుకు ఇచ్చారు. సదరు భోగస్ కంపెనీ ఈ స్థలంలోప్రైవేటు నిర్మాణాలు చేపట్టటంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పందించి చర్యలకు ఆదేశించారు.

see also:తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!

రెండు దఫాలుగా ఉన్నతాధికారులు, లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధులతో సమావేశవై సమిక్షించారు. భోగస్ కంపెనీ స్వాదీనం చేసుకున్న భూములను తిరిగి ప్రభుత్వం పరం చేసేందుకు అధికారులను నిర్దేశించి క్రిమినల్ కేసులకు ఆదేశించారు. భూములను కాపాడేందుకు వత్తిడి తెచ్చారు. ఇదే సందర్భంగా గతంలో తోహాస్ కమిటీకి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిణం పరిహారంగా విడుదల చేసి లెక్కలు లేకుండా పోయిన రూ. 40,17,487 నిధుల బాధ్యుల మీద చర్యలకు మంత్రి నిర్దేశించారు. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో నిరంతరం సమిక్షిస్తూ ఎట్టకేలకు భూములను తిరిగి స్వాదీనం చేసుకునేలా చేశారు.

see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!

ఇలా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అధికారులు సదరు భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నట్టు ఉత్తర్వులు జారీ చేసి మంత్రికి బుధవారం వివరించారు. అయితే రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోని తోహాస్, రవాణా శాఖ ఇతర భూముల పై మంత్రి మరోసారి బుధవారం ప్రిన్స్ పుల్ సెక్రటరీ సునీల్ శర్మతోాఅరా తీసారు .పెట్ బషీరాబాద్ ,తిమ్మాపూర్(కరీంనగర్),హనుమకొండ(వరంగల్),కామారెడ్డి, బాలానగర్(మహబూబ్ నగర్)లో తోహాస్ కు కేటాయించిన స్థలాలను,ఇతర స్థలాలు దుర్వీనియెగం, అన్యాక్రాంతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములకు టోకరా వేసేందుకు యత్నించిన వారి మీద చర్యల గురించి మంత్రి వాకాబు చేశారు.

see also:మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat