Home / POLITICS / ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!

ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. ఈ జవాబు పత్రాన్ని చూస్తే కేటీఆర్ ట్వీట్ చేసింది నిజమే కదా అనిపించక తప్పదు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్న కేటీఆర్.. టీచర్‌ను కూడా స్మార్ట్‌గా రైట్ మార్కు వేసేశారని పొగిడారు. ఈ బుడత క్రియేటివిటికి మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు.

తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో ఆకలితో ఉన్న పిల్లి.. ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ప్రశ్న అడిగారు. సదరు విద్యార్థి మాత్రం ఆ దారేమి ఆలోచించకుండా.. పిల్లి పాలు తాగేందుకు షార్ట్‌కట్‌గా గీత గీసేశాడు. పిల్లాడి సమాధానానికి టీచర్ కూడా రైట్ మార్కు వేసేశారు. అది ఒక్కటి కాదు.. స్టార్ కూడా ఇచ్చారు. అయితే మంత్రి కేటీ ఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

see also;జయశంకర్ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat