ఇటీవల కాలంలో మెగా, నందమూరి హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఒకరు నిర్వహించిన కార్యక్రమాలకు మరొకరు హాజరవుతూ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం ఎంత వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం విజేత. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. జులై నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ జూన్ 24న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్న సంగతి తెలిసిందే. మరో ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ కూడా హాజరుకాబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి తాజా సమాచారం.