Home / POLITICS / ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ప్రోగ్రాం..అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మంత్రి కేటీఆర్‌

ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ప్రోగ్రాం..అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ త‌ను చెప్పిన మాట‌కు ఎలా క‌ట్టుబ‌డి ఉంటారో తెలియ‌జెప్పే ఉదంతం ఇది. ప్ర‌భుత్వం ప‌రంగా అనేక కీల‌క‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా త‌న‌దైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోట‌ల్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అందరి దృష్టిని ఆక‌ట్టుకునే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఆగస్టు 25, 26న హైదరాబాద్‌లో ఎనిమిదవ ఎడిషన్‌ ఎయిర్‌టెల్‌ మారథాన్‌ 2018ను నిర్వహిస్తున్నది. దీన్ని పురస్కరించుకొని మంగళవారం హోటల్‌ తాజ్‌ క్రిష్ణలో ఏర్పాటు చేసిన సన్నాహాక కార్యక్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఏపీ సీఈవో అవ్‌నీత్‌ సింగ్‌ పురితో కలిసి మంత్రి కేటీఆర్‌ మారథాన్‌కు సంబంధించిన మెడల్‌, బ్రోచర్‌, జెర్సీని ఆవిష్కరించారు.

see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ ‘ప్రణామం’

కార్యక్రమం సందర్భంగా వేదిక మీదకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు నిర్వాహకులు మందుకు రాగా.. కేటీఆర్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్లాస్టిక్‌ బొకేగా గుర్తించిన ఆయన.. ‘‘ప్లాస్టిక్‌ బొకే వద్దు… నేను తీసుకోను… ప్లాస్టిక్‌ అస్సలే వద్దు… దాని బదులు చిన్న నేచురల్‌ ఫ్లవర్‌ ఇచ్చినా చాలు…’’అని చెప్పారు. దీంతో మంత్రి కేటీఆర్ చిత్త‌శుద్ధిని చూసి ప‌లువురు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇలాంటి నాయ‌కులే కావాల‌ని ఆకాంక్షించారు.

see also:రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్

దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ మెరుగైన స్థానంలో ఉందని, అయితే దీంతో సంతృప్తి చెందకుండా ఉన్నత స్థితికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ సర్వేలో నాలుగు సార్లు ఉత్తమ నగరంగా నిలిచనట్లు చెప్పారు. ఘన చరిత్ర కలిగిన గండిపేట్‌ చెరువు 100 ఏండ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చేస్తున్న సుందరీకరణ పనులు 2020 నాటికి పూర్తవుతాయని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌ చేసుకునేందుకు వీలుగా 26 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

see also:ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..!!

దీన్నొక వీకెంట్‌ స్పాట్‌గా తీరిదిద్దాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. 8వ ఎడిషన్‌ ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వియజవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఐశ్వర్యను ప్రత్యేకంగా అభినందించారు. భారతీ ఎయిర్‌టెల్‌  తెలంగాణ, ఏపీ సీఈవో అవ్‌నీత్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌ ఖ్యాతి గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లుగానే ఎయిర్‌టెల్‌ మారథాన్‌ ఖ్యాతి విస్తరిస్తున్నదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్సాహవంతులు మారథాన్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

see also:తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat