Home / MOVIES / విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో మైలురాయి..!

విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో మైలురాయి..!

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య‌దేవ‌ర‌కొండ ఆ త‌రువాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తొలి హిట్‌ను అందుకున్నాడు. త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో విజ‌య్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇక ఆ త‌రువాత విడుద‌లైన అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ పెరిగిపోయింది. యువ ప్రేక్ష‌కుల‌కు ఆరాధ్య న‌టుడిగా విజ‌య్ దేవ‌రకొండ మారిపోయాడు.

see also:శ్రీ‌రెడ్డిపై ప‌విత్రా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాల‌తో టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా, స్టార్ హీరోల‌తో సైతం పోటీప‌డీ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక దానిని వేలం వేసి ప్ర‌భుత్వానికి స‌హాయ నిధి ఇస్తాన‌ని చెప్పి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

see also:అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్

ఇక అస‌లు విష‌యానికొస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు బెంగాళీ భామ మ‌లోవికా బెన‌ర్జీతో జ‌త‌క‌ట్ట‌నున్నాడు. ఇందులో విశేష‌మేమిటంటే.. విజ‌య్ చేస్తున్న‌ది ఒక వీడియో సాంగ్‌. భాను శ్రీ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ వీడియో సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌లోవికా జంట‌గా న‌టిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. గ‌తంలో హిందీలో హృదిక్ రోష‌న్‌, సోనం క‌పూర్‌, ఇమ్రాన్ హ‌ష్మీ లాంటి వారు వీడియో సాంగ్‌ల‌లో న‌టించారు. టాలీవుడ్‌లో మాత్రం ఈ ఘ‌న‌త ద‌క్కించుకున‌న న‌టుడిగా విజ‌య్ నిలిచాడు.

see also:రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat