Home / ANDHRAPRADESH / టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!

టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!

గత ఎడాది నవంబర్ లో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా పాలిస్తున్నారో తెలుస్తుంది. పచ్చ దొంగలు అమరావతిని భ్రష్టుపట్టించినట్లే షికాగోలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో తాను పోరాడితే..

see also:జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను రక్షించుకునేందుకు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఏడాదిపాటు నిషేధించడాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి గౌతమి అనే యువతిని నమ్మించి పెళ్లిచేసుకుని ఆపై హత్యచేశాడు. గౌతమి చెల్లెలు పావని పోరాటంతో టీడీపీ నేతలే హంతకులు అని, వారి హస్తం ఉందని తేలింది. ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకున్నప్పుడు ఆమెపై టీడీపీ నేత చింతమనేని దాష్టీకానికి పాల్పడగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావు.

see also:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టి అమ్మాయిలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరితే టీడీపీ నేతల రంగు బయటపడుతుందని అందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. నారాయణ కాలేజీల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వేధింపులపై కేసులు ఉండవు. తాజాగా టీడీపీ సర్పంచ్‌ హరిణికుమారిని ఆమె భర్త, టీడీపీ యూత్‌ లీడర్‌ భీమవరపు యతేంద్ర రామకృష్ణ చిత్ర హింసలు పెట్టినా కేసులపై విచారణ జరపరు.

see also:బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!

ప్రభుత్వం టీడీపీది అయినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. మదమెక్కి టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిస్తూ రాష్ట్రాన్ని మరింత వెనక్కి తీసుకెళ్తున్నారు. ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు ఏడాదికి 9.4 శాతం పెరుగుతుందంటే.. వ్యవసాయంలో కానీ, పరిశ్రమల ఏర్పాటుల్లో మాత్రం అభివృద్ధి లేనందుకు సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి..తరిమి కొట్టాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.

see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat