బుజ్జిగాడు సినిమాతో వెండి తెరకు పరిచయమై బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి సంజన ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల కాలంలో శ్రీరెడ్డితోపాటు పలు మహిళా సంఘాలు పెదవి విరిచిన విషయం తెలిసిందే. చివరకు మా అసోసియేషన్‌పై దిగి వచ్చి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులను అరికట్టేందుకు ఓ కమిటీ వేసే వరకు వారి ఆందోళన సాగింది. అంతేకుండా, టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మితి మీరి జరుగుతున్నాయని ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్న విషయం విధితమే.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ యాంకర్‌గా ఓ ప్రముఖ ఛానెల్ ప్రసారం చేస్తున్న ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సంజన క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో కమిట్ మెంట్‌కు కమిట్ అయితేనే ఆఫర్స్ ఇస్తారని చెప్పింది. అంతేకాకుండా, నేనే ప్రొడ్యూసర్నంటూ యువతులను వాడుకునే వారు సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి సంజన.