Home / ANDHRAPRADESH / టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!

టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!

నవ్యాంధ్రలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత ఇటివలే ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు మన్యంలోని రంపచౌడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.అయితే ఆమె అంతకుముందు పార్టీ మారాలని టీడీపీ నేతలు ఇరవై కోట్లు ఆఫర్ కూడా చేశారని ఆమె అణుబాంబు పేల్చారు.ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో సదరు ఎమ్మెల్యేకు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే విధంగా షాకిచ్చారు.వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్వరి గెలవడం కష్టమని ఇప్పటికే సొంతగా బాబు చేయించిన పలు సర్వేలలో తేలడంతో అక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనని తప్పించి మాజీ ఎమ్మెల్యేలు అయిన శీతంశెట్టి వెంకటేశ్వరరావు,చిన్నంబాబు రమేష్ లేదా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వీలిన మండలాల నుండి ఎంపీగా పోటి చేసిన కొమరం పాణీశ్వరమ్మకు టికెట్ ఇవ్వాలని బాబు ఆలోచన .

దీంతో గతంలో పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకే సీటు ఇస్తాను నమ్మబల్కిన చంద్రబాబు తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో రానున్న ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వడం కుదరదు అని జిల్లా పార్టీ నేతలకు తేల్చి చెప్పారు .అంతే కాకుండా ఏకంగా గెలవడానికి తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేయమని బాబు ఆదేశాలు కూడా ఇచ్చారు.సో బాబును నమ్మడం అంటే పడవలో నుండి నీటిలోకి దూకడం అని ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకు అర్ధమైంది అని జిల్లాలో గుసగుసలాడుకుంటున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat