Home / MOVIES / RRR తాజా అప్టేడ్స్‌.. రాజ‌మౌళీ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌యా..!

RRR తాజా అప్టేడ్స్‌.. రాజ‌మౌళీ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌యా..!

టాలీవుడ్ సెన్షేష‌న్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తాజాగా తెర‌కెక్కించ‌బోతోన్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. సుమారు రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కలిసి న‌టించ‌బోతున్నారు. టాలీవుడ్ స‌త్తాను ప్ర‌పంచానికి తెలియ‌జేసిన బాహుబ‌లి చిత్రానికి క్రేజ్‌ను తీసుకొచ్చిన‌ట్టే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కూడా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాడు రాజ‌మౌళి.

ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్‌ను క‌లిశాడ‌ట‌. ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రానికి సంబంధించి రాజ‌మౌళి పూర్తి వివ‌రాలు తెల‌ప‌డంతో క‌ర‌ణ్‌జోహార్ ప్ర‌మోష‌న్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే, త‌మిళంలోనూ ప్ర‌ముఖుల‌తో సంప్ర‌దింపులు జరిపేప‌నిలో ప‌డ్డారు రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఈ చిత్రం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ న‌వంబ‌ర్‌లో ప్రారంభం అవుతుంద‌ని, మొద‌ట ఎన్టీఆర్‌పై కొంత భాగాన్ని షూట్ చేసి.. ఆ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్న‌ట్టు చిత్ర బృందం స‌మాచారం. ఏదేమైనా బాహుబ‌లి రేంజ్‌లో బిజినెస్ చేసేందుకు రాజ‌మౌళి తెగ క‌ష్ట‌ప‌డిపోతున్నార‌న్న‌మాట‌.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat