జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు..!

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా వైఎస్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వ‌స్తేనే పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లంతా నిన‌దిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిదంటున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు.

పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతాల్లోజ‌గ‌న్ నినాదాల‌తో మారుమ్రోగుతున్నాయ‌ని చెప్తున్నారు. ఎవ‌రి నోట విన్నా జ‌గ‌న‌న్న పేరు వినిపిస్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలిచిన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ అని పార్టీ నేత‌లు అంటున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఊల‌ప‌ల్లి నుంచి 212వ రోజు పాద‌యాత్రను ప్రారంభించి బిక్క‌వోలు మీదుగా న‌డుస్తున్నారు.

రామేశ్వ‌రానికి చెందిన టీడీపీ నేత చిన‌బాబు, ఏపీ త్ర‌యాణికి చెందిన ఈశ్వ‌ర్‌రావు, కాంగ్రెస్ నేత శ్రీ‌నివాస్‌తోపాటు త‌మ అనుచ‌రులు వంద మంది వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం గొల్ల‌ల మావిడాల బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.