ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్.. – Dharuvu
Breaking News
Home / MOVIES / ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..

ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..

వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు.

ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని ఒక సీన్ చిత్రీకరణలో భాగంగా టెన్షన్ తో అనుపమ స్పృహా తప్పి కింద పడిపోయారు.

దీంతో చిత్రం యూనిట్ ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.చికిత్స అనంతరం అనుపమ కోలుకున్నట్లు తన సోషల్ మీడియా అధికారక ఫేజీలో పోస్టు చేశారు.అయితే అంతకుముందే చలిజ్వరంతో బాధపడుతున్నట్లు..లోబీపీ రావడంతో కళ్ళు తిరిగి పడిపోయాను అని అసలు విషయం చెప్పింది ముద్దుగుమ్మ..