నయనతారలో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిన నయన్ తన సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణయిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొలమావు కోకిల చిత్రాన్ని ఎవరూ ఊహించని డేట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ ప్రస్తుతం కొలమావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైలర్ చూసి సమంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
అయితే, ఈ చిత్రంలో నయన తార డ్రగ్స్ అమ్మే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అందుకే కొలమావు కోకిలపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విశ్వరూపం -2 చిత్రానికి పోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది నయనతార. దీంతో సూపర్‌స్టార్ క్లాష్‌లో విన్నర్‌గా నిలిచేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తనకు మాత్రమే ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లను ఎంచకుంటూ చిత్రాలల్లో నటిస్తున్న నయనతారవ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కొలమావు కోకిలతో తరోసారి తన స్టార్‌డమ్‌ను చూపించాలనుకుంటోంది. అందుకే లోక నాయకుడి చిత్రంతో పోటీ పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.