Home / NATIONAL / జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్

జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్

వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగనమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. “హిమ దాస్‌ విజయం మరిచిపోలేని క్షణాలు. రేసులో నెగ్గిన వెంటనే జాతీయ పతాకం కోసం ఆమె అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై విజేతగా నిలిచిన హిమ దాస్‌ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించింది. ఈ వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరంటూ” ట్వీట్ చేశారు. ఫిన్లాండ్‌లోని టాంపెరె వేదికగా జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించింది. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ దాసే కావడం విశేషం. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ దాస్ తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదిక ప్రశంసల వర్షం కురుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat