ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు ..ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు ..ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి

ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు ..ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి

ఏపీలో బాలికలపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఎక్కడ ఒక్క చోట రోజు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన అనవతపురం జిల్లా కణేకల్లు పట్టణంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. కణేకల్లులోని ఉరవకొండ రోడ్డులో వెంకటేష్‌ అనే యువకుడు నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నాడు. ప్రతి రోజూ అక్కడే ఉంటూ ఆ ప్రాంతంలోని పలువురు చిన్నారులతో సఖ్యతగా ఉండేవాడు. వారికి చాక్లెట్లు ఇవ్వడంతో పాటు సెల్‌ఫోన్లో బొమ్మలు చూపిస్తూ, పాటలు వినిపిస్తూ దగ్గర చేసుకున్నాడు. మందు తాగే అలవాటున్న వెంకటేష్‌ కు పెల్లి కూడ కాలేదు.. కాగా ఆదివారం ఈ ప్రాంతంలో ఉన్న ఓ ఐదేళ్ల చిన్నారిని తనతో పాటు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పరిసరాల్లోని ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు చూసి చిన్నారి తండ్రితో పాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. అక్కడి ప్రజలంతా వెంకటేష్‌ను చుట్టు ముట్టడంతో వారిపై ఎదురు తిరిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన స్థానికులు వెంకటేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘట నా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఎస్‌ఐ రామారావు ప్రత్యక్ష సాక్ష్యులను, చిన్నారి తండ్రిను విచారించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.