Home / MOVIES / మ‌ళ్లీ విడుద‌ల‌వుతున్న మ‌గ‌ధీర‌

మ‌ళ్లీ విడుద‌ల‌వుతున్న మ‌గ‌ధీర‌

స్టార్ హీరో వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సెకండ్ మూవీతోనే టాలీవుడ్ స్టార్‌గా మారాడు. రీసెంట్‌గా 200 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను క్రాస్ చేశాడు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాడు. అయితే, ఇది త‌న కొత్త సినిమాతో కాదు. త‌న‌కు స్టార్ డ‌మ్ తెచ్చిన త‌న రెండ‌వ సినిమాతో. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రనేగా మీ ప్ర‌శ్న‌..అత‌నే టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

రామ్‌చ‌ర‌న్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ద‌శాబ్దం దాటిపోయింది. 2009లో రామ్ చ‌రణ్ న‌టించిన మ‌గ‌ధీర చిత్రం విడుద‌లైంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌గ‌ధీర ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ స‌మ‌యంలో మ‌గ‌ధీర చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమాను అద్భుత కావ్యంగా తెర‌కెక్కించారు. సినీ ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విధంగా రాజ‌మౌలి ఈ చిత్రంలో పోరాట స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. ఈ సినిమా తెలుగుతోపాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అనువాద‌మై విజ‌యం సాధించింది.

అయితే, మ‌రో మారు రామ్ చ‌ర‌ణ్ మ‌గ‌ధీర‌గా సంద‌డి చేయ‌బోతున్నాడు. కానీ, మ‌న‌దేశంలో కాదు.. జ‌పాన్‌లో అట‌. మ‌గ‌ధీర మూవీని జపాన్‌లో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. బాహుబ‌లి చిత్రంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి మంచి క్రేజ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మ‌గ‌ధీర చిత్రాన్ని జ‌పాన్‌లో విడుద‌ల చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat