Home / SLIDER / తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!

తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

నేతన్నకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12 వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకాల గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు.అలాగే హ్యాండ్లూమ్, పవర్ లూం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించానన్నారు.

చేనేత రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవేకాక మరో 10 క్లస్టర్లను మంజూరు చేయాల్సిందిగా మంత్రి స్మృతి ఇరానీని కోరానని తెలిపారు. 8 వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఆధునీకరణ కోసం కేంద్ర నిధులు కోరామని అన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు.