Home / POLITICS / మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బ‌ర్త్‌డే..సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గ్రీటింగ్స్‌

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బ‌ర్త్‌డే..సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గ్రీటింగ్స్‌

రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరువేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు.

అదే విదంగా బోనగిరి యాదాద్రి జిల్లాలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృషారెడ్డి ,శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగడి సునీతా మహేందర్ రెడ్డిలతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి అద్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,  శాసన మండలి సభ్యులు పూల రవీందర్, న‌కిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం,మునుగోడు శాసన సభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,మిర్యాలగూడెం శాసనసభ్యులు భాస్కర్ రావు ,దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ తదితరులు హాజరయ్యారు అదే విదంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ,టి ఆర్ యస్ పార్టీ నాయకులు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామలలో సూర్యపేట పట్టణంలో నీ అన్ని వార్డులలో ఘనంగా నిర్వహించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat