Home / ANDHRAPRADESH / వైసీపీ నేత క‌న్న‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

వైసీపీ నేత క‌న్న‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో జ‌గ‌న్‌కు తెలియ‌జేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ‌కు పింఛ‌న్‌లు అంద‌డం లేద‌ని వృద్ధులు, త‌మ‌కు రుణాలు మాఫీ చేయ‌లేద‌ని రైతులు, డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, కాకినాడలో ఇవాళ జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ‌స‌భ‌లో తూర్పు గోదావ‌రి జిల్లా టీడీపీ నేత క‌న్న‌బాబు మాట్లాడుతూ.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా కాకినాడ ప్ర‌జానీకం వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డిచార‌న్నారు. ట‌క్కు ట‌మార విద్య నేర్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో వైఎస్ జ‌గ‌న్ పోరాడుతున్నార‌ని, అటువంటి జ‌గ‌న్‌కు మ‌న‌మంద‌రం అండ‌గా ఉండాల్సి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి చేసే వ‌ర‌కు త‌న‌వంతు కృషిగా అహ‌ర్నిశ‌లు కృషి చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.