Home / SLIDER / మరో కీల‌క ప‌నికి మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

మరో కీల‌క ప‌నికి మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. కీల‌క ర‌వాణ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. గచ్చిబౌలీలో రూ. 263కోట్ల నిధులతో మల్టీగ్రేడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జీ పనులను మంత్రులు కేటీఆర్,మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడ గాంధీ,

బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లై ఓవర్  శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ శేరిలింగంపల్లి లో ఘననీయంగా పట్టనీకరణ జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువైంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా 23వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జనాభాకు తగినట్లు మౌళిక సదుపాయాలు కల్పించకపోతే తీవ్ర ఇబ్బందులుంటాయ‌ని పేర్కొన్నారు.

263‌ కోట్లతో బొటానికల్ గార్డెన్ వద్ద మూడు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మూడు వేల కిలోమీటర్ల మేర మిషన్‌ భగీరథ‌ కొరకు రోడ్లను తవ్వడం జరిగింది. దీని వల్ల తాత్కాలింగ  ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నయని అయితే, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వకుండా సీఐపీపీ టెక్నాలజి ద్వారా పైప్ లైన్ లు వేస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడలో బాగంగా మెట్రో రైలును నడుతున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో రైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటివిలో భాగంగా ఆర్టీసీ, సెట్విన్ బస్‌లను నడుపుతుంద‌న్నారు. ఎంఎంటీఎస్ రెండో దశను వేగవంతం చేస్తున్నామ‌ని, వాహణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను నడపనున్నామ‌న్నారు.

ఎస్ఆర్‌డీపీ కింద‌ మూడు అండర్ పాస్ లు ప్రారంభించామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నెలలో మైండ్ స్పేస్ అండర్ పాస్ ప్రారంభిస్తామ‌ని, ఎల్బీనగర్- కామినేని వద్ద ఎడమ వైపు ఉన్న ఫ్లై ఓవర్ను ఈ నెల్ చివరినాటికి ప్రారంభిస్తామ‌న్నారు. మార్చి 2019లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జ్ కు టెండర్లను పిలిచామని మంత్రి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat