Home / TELANGANA / బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’షో కు పోలీసులు

బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’షో కు పోలీసులు

తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’ షో నిర్వహకులకు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గత నెలలో దేశ ద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేష భావనను రేకెత్తించడం నేరపూరితమైన నమ్మక ద్రోహం, మోసం, దురుద్దేశంతో శాంతిని భగ్నపరచడం, వర్గాల నడుమ శత్రు భావనను పెంపొందించడం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు ఆధార్‌ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.