పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతున్న పేరిది. నటించింది ఒక్క సినిమానే అయినా.. సుమారు ఐదు సినిమాల్లో నటించినంత పేరును సంపాదించుకుంది. అంతలా వెండితెరపై తన గ్లామర్ షోను ప్రదర్శించింది ఈ భామ. అయితే, తొలి చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబుడుతోంది. టాలీవుడ్ బాక్సీఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్న చిత్రంగా విడుదలై.. మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగలిగింది ఈ చిత్రం.
అయితే, పాయల్ రాజ్‌పుత్ తన తొలి చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షలేనట. ఈ విషయాన్ని తానే వెల్లడించింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ తన అందాల ప్రదర్శన ఏస్థాయిలో చేసిందో అందరికీ తెలిసిందే. లిప్‌లాక్‌లు, ఘాటు కౌగిలింతలు, టు పీస్ బికినీ ఇలా తన మొదటి చిత్రంలోనే అంతా చూపించేసింది పాయల్ రాజ్‌పుత్.