ఎస్ఐ భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు..కానిస్టేబుల్ భార్య ఎస్ఐ ఇంటికి వెళ్లి..! – Dharuvu
Breaking News
Home / CRIME / ఎస్ఐ భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు..కానిస్టేబుల్ భార్య ఎస్ఐ ఇంటికి వెళ్లి..!

ఎస్ఐ భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు..కానిస్టేబుల్ భార్య ఎస్ఐ ఇంటికి వెళ్లి..!

పోలీసు శాఖలో మరొక అక్రమ సంబంధం వెలుగు చూసింది. భార్య వుండగానే మరొక లేడీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఖాకీ బండారం బట్టబయలు అయ్యింది. బళ్లారి నగరంలో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తి కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వెలుగు చూసింది. ఎస్ఐ, పోలీసు భార్య గొడవ నడిరోడ్డులోకి రావడం, నానా హంగామా చెయ్యడంతో చివరికి ఇద్దరూ జైలుకు వెళ్లారు. బళ్లారి నగరం వైర్ లెస్ విభాగంలో కిరణ్ సామ్రాట్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ డీఏఆర్ క్వాటర్స్ లో నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భార్య, పాపతో కలిసి నివాసం ఉంటున్నాడు. కానిస్టేబుల్, మహిళకు ఐదు ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ కు మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక పాప ఉంది. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ కు పెళ్లికి ముందే కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం ఉందని సమాచారం. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ భార్య ఎస్ఐ కిరణ్ సామ్రాట్ ఇంటికి వెళ్లింది.

ఆ సందర్బంలో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. కొంత కాలంగా ఎస్ఐ, కానిస్టేబుల్ భార్య మద్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఎస్ఐ కిరణ్ సామ్రాట్, కానిస్టేబుల్ భార్య మద్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఇంటికి నిప్పంటించారు. ఇంటిలోని సోఫా, పర్నీచర్, దుస్తులు బూడిద అయ్యాయి. క్వాటర్స్ లోని ఇంటి కిటికీ అద్దాలు ద్వంసం అయ్యాయి. క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, గాంధీబజార్ పోలీసులతో కానిస్టేబుల్ భార్య గొడవ పెట్టుకుంది. నా ఇష్టం వచ్చిన వారితో తిరుగుతాను, ప్రశ్నించడానికి మీరెవరు అంటూ వాగ్వివాదానికి దిగింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ ఆమె క్వాటర్స్ రోడ్డులో నానా హంగామా చేసింది. గొడవ జరిగిన సమయంలో ఎస్ఐ, కానిస్టేబుల్ భార్య మద్యం సేవించారని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని కేసు నమోదు చేసిన అధికారులు ఎస్ఐ, కానిస్టేబుల్ భార్యను అరెస్టు చేసి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎస్ఐ కిరణ్ సామ్రాట్ ను సస్పెండ్ చేసి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.