Home / SPORTS / 9200 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

9200 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని, విధులు నిర్వహించలేని వారిని క్రమబద్దీకరించకుండా ఉండే విధంగా విధానం రూపొందించాలని సిఎం చెప్పారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలని ఆదేశించారు.

పంచాయ‌తీరాజ్ శాఖ‌పై తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం నిర్వ‌హించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. “పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్‌లో కార్యదర్శుల నియామకాలు జరపాలని చెప్పాలి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. పాత గ్రామ పంచాయితీల్లో కూడ ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయితీ కార్యదర్శులుండాలి. ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇంచార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలి` అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.  ` `ఈ నిర్ణ‌యంలో భాగంగా కొత్తగా 9200 మందిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలి. నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించండి` అని పంచాయిత్ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.

‘‘గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శగ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని నమ్ముతున్నది. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిపాలన సౌలభ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో కొత్త పంచాయితీలను కూడా ఏర్పాటు చేసింది. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువల నిర్మాణం- నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకున్నాయి. గ్రామ పంచాయితీ పాలక వర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలి. అందుకే 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుంది. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయి. దేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది’’  అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat