Home / MOVIES / త్వ‌ర‌లో బాషాకు సీక్వెల్..?

త్వ‌ర‌లో బాషాకు సీక్వెల్..?

బాషాకు సీక్వెల్ రానుందా..? 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా..? బాషా సీక్వెల్‌ సినిమాపై ర‌జ‌నీ ఏమంటున్నాడు.. వంద‌సార్లు చెప్పిన‌ట్టే అంటూ మ‌రోసారి ర‌చ్చ చేస్తాడా..? అస‌లే ఈ మ‌ధ్య మాఫియా క‌థ‌ల‌పై మ‌న‌సు ప‌డుతున్న ర‌జ‌నీ బాషా సీక్వెల్ గురించి ఏం చెప్పాడు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

నేను ఒక్క‌సారి చెబితే.. వంద‌సార్లు చెప్పిన‌ట్టు. ఈ డైలాగ్‌కు ఇంకో వందేళ్ల‌యినా క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌దేమో. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పిన వాయిస్ బేస్ అటువంటిది. బాషా, మాణిక్ బాషా అంటూ ర‌జ‌నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేం.22 ఏళ్ల‌యిపోయినా కూడా ఇప్ప‌టికీ బాషా అంటే అదే క్రేజ్‌.

అటువంటిది బాషా సీక్వెల్ చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ప్లాష్ బ్యాక్ క‌థ‌ల‌కు డిమాండ్ తీసుకొచ్చిన సినిమా ఇది. సురేష్ కృష్ణ కూఆ బాషా సీక్వెల్‌పై అప్ప‌ట్లో మాట్లాడినా, ఆ త‌రువాత దానిని ముట్టుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని సైలెంట్ అయిపోయాడు. అయితే, కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జనీ న‌టిస్తున్న చిత్రం బాషాను పోలి ఉంటుంద‌ని స‌మాచారం. ఆ మ‌ధ్య క‌బాలి, కాలా చిత్రాల్లో మాఫియా డాన్‌గా క‌నిపించాడు ర‌జ‌నీ. అయితే, కార్తీక్ సినిమాలో మాత్రం ప‌గ‌టిపూట హాస్టల్ వార్డెన్‌గాను, రాత్రిపూట డాన్‌గాను ర‌జ‌నీ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ డెహ్రాడూన్‌లో జ‌రుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat