Home / INTERNATIONAL / టైటానిక్, అవతార్ చిత్రాలని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ మరో కొత్త ట్రైలర్..ఒళ్ళు గగుర్పొడిచేలా

టైటానిక్, అవతార్ చిత్రాలని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ మరో కొత్త ట్రైలర్..ఒళ్ళు గగుర్పొడిచేలా

హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ వంటి అద్భుత చిత్రాలని సృష్టించిన సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ నుండి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. కెమరూన్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా ఉన్నారు . రోసా సాలాజర్ అలీటా అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్ విడుదల చేసింది. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులకి ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.

చిత్రంలో అలీటా అనే యువతిని బొమ్మలా కనిపించనుంది. ఎప్పటి నుండో నిద్రలో ఉన్న అలీటా అనే యువతికి తన గతం ఏంటో తెలియదు. ఒక్కసారిగా మేల్కొన్న ఆమెని ఇడో అనే వైద్యుడు తనతో పాటు తీసుకెళతాడు. ఆమె గతంలో చాలా అద్భుతాలు జరిగాయని భావిస్తాడు . అయితే అలీటీకి హ్యూగో అనే వ్యక్తి పరిచయం కావడం, అతనితో మరింత స్నేహం పెరగడం జరుగుతుంది. ఈ క్రమంలో అలీటాకి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా హ్యుగో ప్రయత్నిస్తాడు.

అలీటా ఉన్న ప్రాంతంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆమెకి గతం గుర్తుకు వచ్చి, తనకి పోరాడే శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది. అలీటాకి ఎలాంటి శక్తులు ఉన్నాయి. దుండగుల నుండి కాపాడుకునేందుకు ఆమె వేసే ప్లాన్స్ ఏంటి? హ్యుగో.. ఉక్కు లాంటి యువతి అలీటాకి ఎలా సాయపడతాడు అనే అంశాలని సినిమాలో చాలా అందంగా చూపించారట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat