వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!! – Dharuvu
Home / BUSINESS / వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!!

వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!!

వాట్సాఫ్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే అనేక ఫీచర్స్ అందించిన వాట్సాఫ్ ..తాజాగా వాట్సాఫ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నది. ఈ ఫీచర్ గురించి వాట్సాఫ్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా గత మూడు రోజులనుండి ఈ అద్భుతమైన ఫీచర్ ను వాట్సాఫ్ తన యూజర్లకు అందిస్తున్నది.అయితే వాట్సాఫ్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్ తో ఒకేసారి నలుగురు స్నేహితులు మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ముందుగా..ఇద్దరు స్నేహితులు 1 TO 1 వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి..అతరువాత మరో ఇద్దరు స్నేహితులను అందులోకి ఆడ్ చెయ్యాలి.ఈ విధంగా గ్రూప్ కాలింగ్ సాధ్యపడుతుంది.అయితే వాట్సాప్ గ్రూప్ వీడియో ఫీచర్ రాని యూజర్లు ఈ యాప్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ అద్బుతమైన ఫీచర్‌ను పొందవచ్చు.