Home / 18+ / విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!

విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!

ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది, వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్‌యూవీలను విక్రయించడానికి ఆర్మీ సిద్దమైంది. యుద్ద తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది.

అత్యంత శక్తంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్‌యూవీలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలందంచాయి. అయితే, ఇవి పాతవి అయిపోవడం, అప్పుడప్పుడు మొరాయించడం మరియు సేఫ్టీ పరంగా మరింత మెరుగైన వాహనాలను ఎంచుకోవాల్సి రావడంతో ఇటీవల టాటా సఫారీ స్టార్మ్ వాహనాలను కొనుగోలు చేసింది.

టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీ అవసరాలకు కావాల్సినన్ని సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను ప్రత్యేక రూపొందించి వివిధ దశల వారీగా డెలివరీ ఇస్తోంది. యుద్ద తలంలో ఆధికారుల మరియు సిబ్బంది తరలింపు అవసరాలకు వీటిని ఉపయోగిస్తారు.

ఇండియన్ ఆర్మీకి సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన మారుతి జిప్సీ వాహనాలు ఇప్పుడు సేవల నుండి తప్పుకొన్నాయి. వీటిని వేలం వేసేందుకు ఇండియన్ ఆర్మీ ముందుకొచ్చింది. ఆర్మీ ఉపయోగించిన జిప్సీ వాహనాలను ఎంచుకునే కస్టమర్లకు 15 ఏళ్ల వారంటీతో నూతన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కూడా ఇవ్వనున్నారు.
ఇండియన్ ఆర్మీకి సేవలందించిన మారుతి జిప్సీ వాహనాన్ని సొంతం చేసుకోవాలనే ఔత్సాహికులకు ఇదొక అరుదైన అవకాశం. వేలంలో వీటిని సొంతం చేసుకున్న కస్టమర్లు సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా పలు మోడిఫికేషన్స్ చేయించుకుంటే చాలా అరుదుగా మరియు కొత్తగా కనబడతాయి.

ఒక్కో వాహనాన్ని లక్ష రుపాయల ప్రారంభ వేలం ధరతో విక్రయిస్తోంది. ఇండియన్ ఆర్మీ వేలం నుండి పదుల సంఖ్యలో మారుతి జిప్సీ వాహనాలను సొంతం చేసుకున్న పూనేకు చెందిన నిలేష్ జెండే వాటిని పూనేలో విక్రయిస్తున్నాడు.

ఈ వాహనాలను దేశంలో ఎక్కడికైనా డెలివరీ ఇస్తాడు. మరియ ఆయా రాష్ట్రాల్లో వీటిని 15 ఏళ్ల వరకు పరిమితితో నూతన వెహికల్‌‌గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆర్మీ సర్వీస్ నుండి వైదొలగిన వాహనాలు చాలా వరకు మంచి కండీషన్‌లోనే ఉన్నాయి. అయితే, మెకానికల్‌గా పలు రిపేరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

నిలేష్ జెండె విక్రయిస్తున్న మారుతి జిప్సీ వాహనాలలో జిప్సీ ఎమ్‌జీ10డబ్ల్యూ సాఫ్ట్-టాప్ వేరియంట్ మోడల్ ఉన్నాయి. ఈ వేరియంట్లో 80బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క ప్రొడ్యూస్ చేసే 1.3-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గుండా లో అండ్ హై రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్ సహాయంతో పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు చేరుతుంది. మారుతి జిప్సీ అత్యంత కఠినమైన మరియు నమ్మదగిన వాహనం.

లక్ష రుపాయలు వెచ్చించి ఇండియన్ ఆర్మీ వినియోగించిన మారుతి జిప్సీ వాహనాలను కొనుగోలు చేస్తే, మరో లక్ష రుపాయల వరకు వెచ్చించి ఎస్‌యూవీ మొత్తాన్ని ఫుల్ కండీషన్‌లోకి తెచ్చుకుంటే కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు.

మారుతి జిప్సీ వాహనాల ప్రొడక్షన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది వీటి ఉత్పత్తికి శాస్వతంగా బ్రేక్ పడనుంది. ప్రస్తుతం ఉన్న మారుతి జిప్సీ భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (BNVSAP) భద్రత ప్రమాణాలను పాటించడం దాదాపు కష్టమే.

మారుతి జిప్సీకి కస్టమర్ల నుండి ఆశించిన డిమాండ్ లభించడం లేదు, ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు వీటి స్థానంలో అత్యాధునిక టాటా సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను ఎంచుకుంటోంది. ఇండియన్ ఆర్మీ ఉపయోగించిన మారుతి జిప్సీ వాహనాలను విక్రయిస్తున్న నిలేష్ జెండె ఫేస్‍‌బుక్ ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చు. లేదంటే 9421252599 లేదా 8208338220 నెంబర్లతో సంప్రదించగలరు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat