Home / ANDHRAPRADESH / సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..

సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..

‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు. అతిపిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశప్రజల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ తొలి సిఎంగా కేసిఆర్ కావడం, ఆయన నాయకత్వంలో మనమంతా పనిచేయడం నిజంగా అదృష్టమే’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కంటిచూపును పరీక్షించే ప్రతిష్టాత్మక కార్యక్రమం కంటివెలుగు ప్రారంభం కానున్న సందర్భంగా నేడు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కంటివెలుగు అవగాహన సదస్సులో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మేథస్సు నుంచి వచ్చిన మరొక చరిత్ర సృష్టించే పథకమే ఈ కంటి వెలుగు అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అభివర్ణించారు. తెలంగాణలోని 3 కోట్ల 60 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న సిఎం కేసిఆర్ నిర్ణయం సాహసోపేతమైందన్నారు.

ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదని, ఈ కంటివెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే కంటివెలుగు విజయవంతమవుతుందని ఈ పథకం సన్నాహక సమావేశంలోనే సిఎం కేసిఆర్ అన్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేదలకు ఉపయోగపడే ఈ పథకం విజయవంతం కావడానికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఇంటికి ఈ పథకం చేరేందుకు అన్ని రకాల ప్రచారాస్త్రాలు వినియోగించుకొని విస్తృత ప్రచారం చేయాలన్నారు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతి చోట అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ కార్పోరేషన్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది జనం ఉన్నారని, దీనికి సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు చెప్పారు. ఈ సూక్ష్మ స్థాయి ప్రణాళిక ప్రతి కార్పోరేటర్ వద్ద ఉండాలని, కార్పోరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటివెలుగు పథకం కింద పరీక్షలు జరిగేలా, సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.
కంటివెలుగు పథకం కింద 3.60 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, ఇందులో 60 నుంచి 70 శాతం మందికి సమస్యలుండవని, 20 నుంచి 30 శాతం మందికి చిన్న, చిన్న కంటి సమస్యలుంటాయని, మిగిలిన వారిలో కొంతమందికి మందులు అవసరమవుతాయని, ఇంకొంతమందికి ఆపరేషన్లు అవసరమవుతాయని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన వారికి రిఫరల్ దవాఖానాలో శస్త్ర చికిత్సలు చేయిస్తారన్నారు. వీటన్నింటిని మించి ఈ కంటి వెలుగు పథకంలో కంటిని కాపాడుకోవడంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. గతంలో వయోభారం పెరిగిన వాళ్లకే కంటి సమస్యలు వచ్చేవని, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

చిన్న పిల్లల్లో ఈ కంటి సమస్యలను మొదట్లోనే గుర్తిస్తే అందత్వం రాదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలంటే అందరికీ మంచి చూపుండాలనే, అంధత్వరహిత తెలంగాణ కావాలనే గొప్ప లక్ష్యంతో కంటివెలుగు కార్యక్రమం రూపొందించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టే ఈ కంటివెలుగు పథకమే కాదు…ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు చరిత్ర సృష్టించే గొప్పతనమున్నవే అన్నారు. 46వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ ద్వారా గతంలో నీళ్లు దొరకని ప్రాంతాలకు కూడా నల్లా నీళ్లు వస్తున్నాయన్నారు. అందుకే ఇదొక చరిత్ర సృష్టించే పథకమన్నారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అన్నారు…అలాంటి తెలంగాణలో 24 గంటలు కోతలు లేని కరెంటు ఇచ్చి సిఎం కేసిఆర్ చరిత్ర సృష్టించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 17వేల కోట్ల రూపాయల మేరకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసి 37 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం ఒక చరిత్రగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి ఇప్పటి వరకు సబ్సిడీలు ఇవ్వడమే ఉందని, మొదటి సారిగా తెలంగాణలో కేసిఆర్ నాయకత్వంలోనే రైతులకు పంట పెట్టుబడి కింద ఏటా ఎకరానికి 8000 రూపాయలు ఇవ్వడం చరిత్ర అన్నారు.

ఈ పథకం కింద ఏటా 12వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నారన్నారు. రైతులు ఏ కారణం వల్ల అయినా చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా ఉండొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో రైతుబీమా పథకం తీసుకొచ్చారని, ఇంత పెద్ద ఎత్తున రైతులకు జీవిత బీమా కల్పించడం కూడా ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, ఇదొక చరిత్రేనన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని పెట్టిన కళ్యాణలక్ష్మీ, గర్భం దాల్చిన మహిళలకు ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం అనంతరం మూడు నెలల తర్వాత నెలకు2000 రూపాయల చొప్పున ఆరు నెలలకు 12వేలు ఇవ్వడం, కేసిఆర్ కిట్ ఇవ్వడం కూడా దేశంలో ఎక్కడా లేదని అన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం, ఇలా సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు చరిత్ర సృష్టించేవే అని, పేదలకు ఉపయోగపడేవే అని చెప్పారు. తెలంగాణను అంధత్వరహిత తెలంగాణగా మార్చే గొప్ప లక్ష్యంతో సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టే కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని దీనిని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, లింగంపల్లి కిషన్ రావు , గుండు సుధారాణి, వాసుదేవరెడ్డి, గాంధీ నాయక్, సంపత్ రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, వినయ్ కృష్ణారెడ్డి, శివలింగయ్య, కమిషనర్ గౌతమ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat