గర్భిణులు చేపలు తినవచ్చా..? – Dharuvu
Home / LIFE STYLE / గర్భిణులు చేపలు తినవచ్చా..?

గర్భిణులు చేపలు తినవచ్చా..?

సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్‌లో ఉన్న కోపెన్‌హాగెన్‌లోని స్టేటన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు.

గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 376 మంది మహిళలు, సాధారణ ప్రసవం అయిన 348 మంది మహిళల రక్తనమూనాలను విశ్లేషించారు.

నెలలు నిండకుండానే ప్రసవించిన రక్తనమూనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు 1.6% తక్కువ ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మహిళలు గర్భం దాల్చిన తొలి వారం నుంచే చేపలను సరిపడా మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.