కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!! – Dharuvu
Breaking News
Home / MOVIES / కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాలు సాయం అందిస్తున్నాయి. అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ వరదలతో అల్లాడుతున్న కేరళకు తన వంతుగా 5 లక్షల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు తన అభిమానులు విరాళాలు అందించాలంటూ.. ‘రౌడీస్.. మనమిచ్చే చిన్న చిన్న మొత్తాలు.. కేరళ ప్రజల జీవితాలను మారుస్తాయి. నాతో పాటు మీరూ రండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా కేరళకు సాయం అందించిన తొలి టాలీవుడ్ హీరో విజయ్ కావడం విశేషం. కాగా ఇప్పటికే నటులు సూర్య, కార్తీ రూ. 25 లక్షల విరాళాన్ని అందించారు.