Home / 18+ / కెరీర్ కోసం త్యాగం చేస్తున్న‌.. జేజ‌మ్మ‌..!

కెరీర్ కోసం త్యాగం చేస్తున్న‌.. జేజ‌మ్మ‌..!

ఏడాది కింద‌టి వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది అనుష్క‌. ఏడాదికి క‌నీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు క‌నిపించ‌డం లేదు. భాగ‌మ‌తి సినిమా త‌రువాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది అనుష్క‌. దీంతో అనుష్క సినిమాల‌ను వ‌దిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివ‌ర‌కు తెలిసింది సినిమాలే ఆమెను వ‌దిలేశాయ‌ని. దీంతో ఏ ద‌ర్శ‌కుడు కూడా అనుష్క వైపు చూడ‌టం లేదు.

తాను సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నా.. ఎవ రూ త‌నకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని చెప్పుకొస్తోంది ఈ భామ‌. భాగ‌మ‌తి సినిమా త‌రువాత ఒక్క సినిమా కూడా చేయ‌లేదు ఈ బ్యూటీ. మ‌ధ్య.. మ‌ధ్య‌లో అనుష్క సినిమాలు చేస్తుందంటూ టాక్ వినిపించినా.. ఏదీ ఫైన‌ల్ కాలేదు. అయితే, త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి తెర‌కెక్కించ‌బోయే, సూర్య హీరోగా నించ‌నున్న చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే య‌ముడు సిక్వెల్స్ లో భాగంగా మూడు చిత్రాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అయితే, ప్ర‌స్తుతం రూపుదిద్దుకుంటున్న చిత్రం య‌ముడు సీక్వెల్ కాద‌ట‌

హ‌రి, సూర్య కాంబినేష‌న్ అంటే ముందుగా అంద‌రికీ గుర్తొచ్చేది సింగం సిరీస్‌. కానీ, ఈ సారి కొత్త క‌థ‌తో సినీ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఎలాగో సూర్య‌తో అనుష్క‌ది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ కాబ‌ట్టి.. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా వీళ్ల‌నే కొన‌సాగిస్తున్నాడు హ‌రి. త‌మిళం నుంచి క‌నీసం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి కానీ… తెలుగు డైరెక్ట‌ర్స్‌ అనుష్క‌ను మ‌రిచిపోయార‌నే టాక్ ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat