వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!

వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. పాదయీత్రలో జగన్ తో పాటు నడిచేందుకు వేలాది మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌, బొడ్డువరం క్రాస్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు.