Home / 18+ / టాలీవుడ్‌లో తెర మీద‌కు కొత్త టైటిల్స్‌..! ఏమిటో తెలుసా..?

టాలీవుడ్‌లో తెర మీద‌కు కొత్త టైటిల్స్‌..! ఏమిటో తెలుసా..?

సినిమాల్లో హీరో, హీరోయిన్ల పేర్ల‌ను బేస్ చేసుకుని టైటిల్స్ పెట్ట‌డంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఎక్స్‌ప‌ర్ట్ అన్న విష‌యం తెలిసిందే. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం అంటూ టైటిల్‌లోనే హీరో హీరోయిన్ల పేర్లు క‌లిపేశాడు. ఆ త‌రువాత కెమెరామ‌న్ గంగ‌తో రాంబాబు హీరో హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్‌ను రివీల్ చేసేశాడు.

హీరో హీరోయిన్ల పేర్ల‌ను షార్ట్‌క‌ట్‌గా పెట్టి అ ఆ సినిమాతో వ‌చ్చాడు త్రివిక్ర‌మ్‌. అన‌సూయ రామ‌లింగం వ‌ర్సెస్ ఆనంద్ విహారి అంటూ ట్యాగ్ లైన్లో హీరో హీరోయిన్ల పేర్ల‌ను జత చేసిన ఈ ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించింది. హీరో హీరోయిన్ల పేర్ల‌తో టైటిల్ లెంతీగా ఉన్నా ద‌ర్శ‌కులు మాత్రం రాజీ ప‌డ‌టం లేదు. త్రివిక్ర‌మ్ ఆ మ‌ధ్య‌న షార్ట్‌క‌ట్‌లో అ ఆ అంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో తీస్తున్న చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌తో హీరో హీరోయిన్ల పేర్ల‌ను విపులంగా చెప్పాడు. అర‌వింద‌గా పూజ‌, వీర రాఘ‌వ‌గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్‌ను కూడా ఇదే ఫార్మేట్‌లో పెట్టాడు. అయితే, టైటిల్‌లో హీరో హీరోయిన్ల పేర్లు కాకుండా.. ఇద్ద‌రు హీరోయిన్ల పేర్లు మాత్ర‌మే ఉంటాయి. చిత్ర ల‌హ‌రి పేరుతో.. చిత్ర‌, ల‌హ‌రి అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఒక హీరోయిన్‌గా నివేధా థామ‌స్ ఎంపిక కాగా… మ‌రో హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది.
ప్ర‌స్తుతం అమెరికాలో మేకోవ‌ర్ అవుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వ‌స్తాడు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat