Home / ANDHRAPRADESH / జైలుకెళ్తా.. తిరగబడతా.. తాటతీస్తా.. అంటున్న పవన్ ఆఒక్క మాట ఎందుకు అనట్లేదు..!

జైలుకెళ్తా.. తిరగబడతా.. తాటతీస్తా.. అంటున్న పవన్ ఆఒక్క మాట ఎందుకు అనట్లేదు..!

నేను ప్రజలకోసం ఎదురు తిరుగుతా.. జనంకోసం జైలుకెళతా.. ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అక్కర్లేదు. ముఖ్యమంత్రి కావాలంటే అధికార అనుభవంకావాలి. కేంద్రానికి ఎదురు తిరిగితే సమస్యలు సృష్టిస్తారని ఎవరో చెబుతున్నారు. నాకు భయం లేదు.. ధైర్యం మాత్రమే ఉంది. దెబ్బతిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటారో తెలుసుకోవాలి. గతంలో ఎన్నికల ప్రచారం విశాఖ ఎంపి హరిబాబు, అనకాపల్లి నుండి అవంతీ శ్రీనివాస్‌ను గెలిపించాలని నేనే.. డిసిఎను ప్రైవేట్‌పరం చేస్తానంటే అంగీకరించను. ఉద్యోగుల తరుపున పోరాడతా.. ప్రజా సమస్యలు పరిష్కరించుకోని నాయకులు, పదవుల్లో ఎక్కువ కాలం ఉండలేరు. ఇప్పటికీ నేను ఏ ఒక్కరికీ భయపడలేదు..నన్ను భయపెట్టినా వెనకడుగు వేయను. ప్రజా సమస్యల కోసం ఎవరితోనైనా పోరాడతాను తప్ప వెనకడుగు వేయను. అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు.

పవన్ ప్రసంగంలో ప్రధాని మోడీని, పరోక్షంగా జగన్‌ పై దాడే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరు దేశ ప్రజలను మోసం చేశారు.. మరొకరు అధికార దాహంతో వ్యవహరిస్తున్నారనే పవన్ ప్రసంగించడం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ఎవరినైనా ఇదే విధంగా నిలదీస్తా డీసీఏ సంస్థను ప్రైవేటీకరించవద్దని ప్రధానికి లేఖ రాయటం జరిగింది. ఈ సంస్థను ప్రైవేటీకరిస్తే ఇక్కడినుంచే బిజెపి పతనం ఖాయం. ప్రజలకు నష్టం చేకూర్చే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదు. రాజకీయ నాయకులకు జవాబుదారీగా ఉండాలి. అధికారం విలువ, బాధ్యత నాకు తెలుసు. నాకు అధికార దాహం లేదు. సమస్యలపై పోరడడానికి అధికారం అవసరం లేదు. జనంకోసం ముందడుగు వేయటమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తేలేదు. డీసీఏ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవల పవన్ నిర్వహించిన సమావేశంలో మోడీతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరించవచ్చన్న వైసీపీ అధినేత జగన్‌ను పవన్ పరోక్షంగా తప్పుపట్టారు. మధ్యలో విశాఖ, అనకాపల్లి ఎంపిలను విమర్శించారే తప్ప చంద్రబాబు పై పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీనిని బట్టి పవన్ వైఖరి స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజలకోసం జైలుకెళ్తా.. తిరగబడతా.. పోరాడతా.. తాటతీస్తా.. అంటున్న పవన్ కళ్యాణ్ ఒక్క చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేయడం లేదనేనదే అసలు ప్రశ్న.. అలాగే కాపుల రిజర్వేషన్ల విషయంలోనూ ఇద్దరూ కలిసే అబద్దాలాడుతున్నారనేది జగమెరిగిన సత్యం.?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat