ఈ మధ్య ఎక్కువ తెలుగులో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. సరైనోడు చిత్రంలో విలన్‌గా నటించిరన ఆది ఆ తరువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలంలో ఆది నటన సినీ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. తన నటనతో వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నాడు ఆది.
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవరు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు కోలీవుడ్‌లో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు ఆది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆర్.ఎక్స్ చిత్రం తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడు. డిఫరెంట్ మూవీస్‌ను ఎంచుకునే ఆది ఒక విచిత్రం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత తమిళంలో నటించిన మిరుగమ్ సూపర్ హిట్ కావడంతో అక్కడే వరుస సినిమాలు చేసి గుండెల్లో గోదావరితో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సరైనోడు చిత్రంలో పోషించిన విలన్ రోల్ వరుస ఆఫర్లను తెచ్చి పెట్టింది. దీంతో ఇక్కడే సెటిల్ అయిన ఆది ఆర్ఎక్స్ 100 రీమేక్‌తో తమిళంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.