Home / 18+ / జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి

జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. ఈడీ రూపొం దించిన చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఆమెను ఎల్లో మీడియా నిందితురాలిగా చిత్రించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్‌ విషయంలో ‘కథనాలు’ రాయడానికి ఈ రెండు తైనాతీ పత్రికలకు అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఎంతో ‘సమాచారం’ అందించిన విషయం కూడా జగమెరి గిన సత్యం.

కొత్తగా పెట్టే కేసులో భారతి పేరును ఈడీ ఇరికించడం సమర్థనీయమేనన్నట్టు ఈ పత్రి కలు ప్రచారం ప్రారంభించాయి.

అప్పట్లో జగన్‌ను ఉమ్మడి శత్రువుగా పరిగణించిన చంద్రబాబు, కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జమిలిగా ఆయనపై యుద్ధం చేశాయి. ఈ క్రమంలో ఆయనపై అక్రమా స్తుల కేసులు నమోదయ్యేలా చూశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్‌తోపాటు ఈ కేసుల్లో నిందితులుగా చేర్చిన అధికారులు, పారిశ్రామికవేత్త లందరూ తర్వాత ఒక్కరొక్కరుగా నిర్దోషులుగా బయటపడుతున్నారు.

ముందుగా, జగన్‌ కేసుల్లో ఇరికించిన సివిల్‌ సర్వీసు అగ్రశ్రేణి అధికారులంతా బయటపడుతూ వచ్చారు. వారితోపాటు మిగిలిన వారికీ న్యాయస్థానాల నుంచి ఊరట లభిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్నతాధికారు లుగా ఉన్న డి.మురళీధర్‌రెడ్డి, బీపీ ఆచార్య ప్రభృ తులకు ఊరట దొరికింది. చివరికి కొందరు ఉన్నతా ధికారుల విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణనే నిలిపివేసింది. వారిపై ఆరో పణలు నిరూపించడంలో సీబీఐ విఫలమైందని హైకోర్టు శఠించిందని మరువరాదు. అంతేకాదు, తదుపరి చర్యలు తీసుకోవద్దనీ హెచ్చరించింది.

సీబీఐతో మిలాఖత్‌ అయి చంద్రబాబు అల్లిన, అల్లించిన కథనాలతో జగన్‌పైనా, వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా పనిచేసిన ఉన్నతాధికారులపైనా ఈ కేసులు నమోదు చేయిం చారు. ఇక జగన్‌పై ఉన్నవి మూడే మూడు కేసులు.

గత ఏడేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసును కూడా ఇప్పటి దాకా న్యాయ స్థానాల ముందు సీబీఐ నిరూపించినట్టు మనకు దాఖలాలు కనిపించడం లేదు.

పైగా సీబీఐ గౌరవ స్పెషల్‌ కోర్టు సైతం అనేకసార్లు, ‘నీ నిర్దిష్ట సాక్ష్యాలు ఏవి? ఎక్కడ, ఎప్పుడు?’ అని నిన్న మొన్నటి వరకూ సీబీఐని ప్రశ్నిస్తూనే ఉందని మరచిపోరాదు.

రాజకీయ లబ్దితోనే కేసుల పేరిట వేధింపులు
సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోనూ పలువురు నిజాయితీపరులైన ఉన్నతాధికారులు లేకపోలేదు.

కాని, ఇటీవల దాకా సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జీల్లో ఒకరుగా రిటైరైన జాస్తి చలమేశ్వర్‌ ఒక సభలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తుచేస్తాను. ‘ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వాల నిర్వహణ సరిగా లేదు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన న్యాయస్థానాలు తది తర పలు సంస్థలూ దారితప్పి నడుస్తున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షాలు, ప్రజాహిత సంస్థలు, పౌరహ క్కుల సంఘాలను నిఘా, దర్యాప్తు సంస్థలు పాల కుల రాజకీయ ప్రయోజనాల కోసం కేసులతో వేధిం చడం ఆనవాయితీగా మారింది’.

అలా ఆచరణలోకి వచ్చిందే ‘క్విడ్‌ ప్రో కో’(నీవు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతా) అన్న సిద్ధాంతం.

చంద్రబాబుపై సీఎం హోదాలో 1989–2018 వరకూ వివిధ సంద ర్భాల్లో నమోదైన 17 కేసుల్లో(అమరావతి భూములు కాక, ఐఎంజీ/ఇమార్‌.ప్రాపర్టీస్‌/ఏలేరు భూముల కుంభకోణంలో సోమశేఖర కమిషన్‌ అభియోగాలు వగైరా) ఆయన ఎలా తప్పించుకుంటూ బయటప డుతూ వస్తున్నారో తెలుసుకోవాలంటే కొన్నేళ్లక్రితం ప్రపంచ బ్యాంక్‌ అనుబంధ సంస్థ డీఎఫ్‌ఐడీ విడు దల చేసిన అధికారిక సర్వే నివేదిక చూడవలసిందే.
జడ్జీల నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర కారణం గానే ఆయనపై వేసిన కేసులు విచారణకు రాలేదని ఆ నివేదిక వివరించింది.
తర్వాత ఇదే విషయాన్ని హైకోర్టు సీనియర్‌ జడ్జీ దివంగత బీఎస్‌ఏ స్వామి హైకోర్టు లాయర్లుకు, సహ న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖలో ఎండగట్టారని మరువరాదు.

ఏళ్ల తరబడి జగన్‌పై కేసులు మోపడానికి చంద్రబాబు తన పూర్వ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్‌ కె.విజయరామారావుతోపాటు, అప్పటి జేడీ లక్ష్మీనారాయణ తోడ్పాటు తీసుకు న్నారు.

జగన్‌పై కేసుల గురించి ఈ మధ్య విలేకరులు ప్రశ్నించగా, లక్ష్మీనారాయణ చిత్రమైన సమాధానం ఇచ్చారు. ‘‘వాటి సంగతి నాకు తెలియదు. నా కింది అధికారులు చార్జిషీట్లు తయారు చేస్తారు. నేను చేసే దల్లా వారిని పర్యవేక్షించడమే. అంతే’’అని ఆయన చెప్పారు.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల సంద ర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసులో వాచా, కర్మేణా దొరి కిపోయిన చంద్రబాబు అర్థంతరంగా ఆగమేఘాల మీద హైదరాబాద్‌ విడచిపోయారు.

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే వీలున్న హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. కేవలం ఈ కేసుకు భయపడటం వల్లే చంద్రబాబు ఈ పనిచేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసుపై గవర్నర్‌ గప్‌చుప్‌ అయితే, ప్రధాని నరేంద్ర మోదీ రెట్టింపు మౌనం. కానీ, ఇదే సమయంలో ఇటు మోదీని, అటు కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌– సోనియాగాంధీతో సంబంధాల్ని ‘రెండావుల దూడ’లాగా ఏక కాలంలో సాకుతూ వస్తున్నాడు చంద్రబాబు.

జగన్‌పైన 11 కేసుల్లో ఎనిమిది కేసులు నిర్వీర్యమైనా, కేసుల సందర్భంగా తన కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వైదొలగినందున వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆయన భార్య భారతికి డైరె క్టర్‌గా తీసుకునే వార్షిక వేతనంపై కూడా తైనాతీ పత్రికలు విచిత్రమైన వాదనలతో కథలు అల్లాయి.

ఇంతకీ భారతి పేరు అకస్మాత్తుగా ఇరికించాలని ‘ఈడీ’కి ఎలా తట్టి ఉంటుంది? అసలు ఉమా శంకర్‌ గౌడ్, గాంధీ అనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధి కారులు ఎక్కడి వారు? వీరికి చంద్రబాబు మార్గదర్శ కుడిగా, సుజనా చౌదరి సహాయకునిగా రంగంలో ఉన్నారన్న ఆరోపణ లేదా వార్తలు నిజమా?

వీరిద్దరూ హైదరాబాద్‌లోని ‘ఈడీ’ ఆఫీసులో ఒక స్థాయి అధికారులు.
టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి కొడుకును సినీ నటి ప్రత్యూష హత్య కేసు నుంచి తప్పించడంలో ఇలాంటి అధికారి ఒకరు ‘హనుమంతుడి’లా సాయపడినట్లు నాడే చెప్పుకు న్నారు.

ఈ అధికారులిద్దరూ బాబుకు సన్నిహితులని అంటారు. ఇందులో నిజానిజాలెలా ఉన్నా ఒకప్పటి ‘జేడీ కొలువు కూటం’లోని ఈ ఇద్దరు ఆఫీసర్లను సుమారు వారం పది రోజులనాడే ఈడీ నుంచి మరో శాఖకు బదిలీ చేశారట.

సరిగ్గా ఈ బదిలీకి ముందే జగన్‌ సతీమణిపై ‘ఈడీ’ కేసులో ముద్దాయి అంటూ ఓ చీకటి కథను అల్లించి వారిద్దరూ ప్రచారంలోకి వదిలారు.

న్యాయమూర్తి కేసును పరిగణనలోకి తీసుకు న్నాకనే ఆయన ఆదేశంపైన చార్జిషీటు తయారు అవు తుంది. ఆ తర్వాతనే అభియోగంలో ఏముందో తెలు స్తుంది. కానీ ఈ ప్రక్రియ ఏదీ జరక్కుండానే ‘ఈడీ’ నుంచి ఇద్దరు ‘కథకులు’ ఉన్నతాధికారులతో సంబం ధం లేకుండా కొన్ని పత్రికలకు ఈ విషయాలు ఎలా చేరవేశారన్నది అసలు ప్రశ్న.

అసలు మొదటి నుంచీ జగన్‌ కేసులో నడుస్తున్న ‘దేవతా వస్త్రాల కథే’ ఇప్పుడు కూడా సీరియల్‌ రూపం దాల్చి ఉంటుంది.

అయినా వైఎస్‌ తండ్రి రాజారెడ్డి ఆస్తిపాస్తులకు, వ్యాపారాలకు పునాదులు ఉన్నాయి. కానీ ఏ పునాదీ లేని రెండెకరాల ఆసామి బాబు వేలకోట్లకు పడగ లెత్తడం ఎలా సాధ్యమైందని బాణంలా దూసుకువ స్తున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకనే ‘తెహెల్కా’ విశ్లేషణకు దొరికిపోయారు.

చివరికి తన హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్ల బోర్డులో సభ్యుడైన ప్రసిద్ధ సినీ నటుడు మోహన్‌బాబు, చంద్రబాబుపై ఎందుకు చీటింగ్‌ కేసు వేయాల్సి వచ్చిందో తెలుగు జాతికి వివరించగ లరా?

-ఏబీకే ప్రసాద్‌,సీనియర్‌ సంపాదకులు

Note: TDP MP దేవేందర్ గౌడ్ దగ్గర బంధువు ఉమా శంకర్ గౌడ్, అలాగే TDP MP సుజనా చౌదరి బంధువు ఈ గాంధీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat