Home / SLIDER / దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు..సీఎం కేసీఆర్

దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు..సీఎం కేసీఆర్

రానున్న దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మంచినీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెట్టని ..60 వేల కోట్లు నీటిపారుదలశాఖలో ఖర్చు పెట్టామని అన్నారు.లక్ష 70 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు.రైతులకు 24 గంటల ఇస్తున్నామన్న కేసీఆర్..త్వరలోనే మంచి నీటిని అందిస్తామని చెప్పారు.కృష్ణా, గోదావరి నీళ్లను తెచ్చి, తెలంగాణలో కోటీ ఎకరాలకు నీళ్ళు ఇస్తామని అన్నారు. సాగు భూములను సన్యశ్యామలం చేయడమే ఇరిగేషన్ లక్ష్యం అని చెప్పారు.